'ఖిలాడి' నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్!
- రవితేజ హీరోగా 'ఖిలాడి'
- ఆయన జోడీగా ఇద్దరు భామలు
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
- త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన
రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో 'ఖిలాడి' సినిమా రూపొందింది. పెన్ స్టూడియోస్ - ఎ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఆల్రెడీ ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. సరైన డేట్ కోసం మేకర్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి నటించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఫస్టు సింగిల్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా టైటిల్ సాంగును సెకండ్ సింగిల్ గా రిలీజ్ చేశారు. 'హి ఈజ్ ఏ గ్రాండ్ మాస్టర్ .. హి ఈజ్ ఏ క్రైమ్ పోస్టర్ .. ఖిల్ .. ఖిల్ .. ఖిలాడి' అంటూ ఈ టైటిల్ సాంగ్ నడుస్తుంది.
విదేశాల్లో ఈ పాటని చిత్రీకరించారు. సాంగ్ మేకింగ్ షాట్స్ ను కలిపి ఈ టైటిల్ సాంగ్ ను వదిలారు. ఈ పాటలో రవితేజను చాలా స్టైలిష్ గా చూపించారు. ఈ సినిమా కోసం భారీస్థాయిలోనే ఖర్చు చేశారనే విషయాన్ని ఈ పాట చెప్పేస్తోంది. ఈ సినిమాతో రవితేజ తన జోరును కంటిన్యూ చేయనున్నాడనే విషయం స్పష్టమవుతోంది