ఆసీస్ చేతిలో ఘోర పరాజయం... ఒక్క మ్యాచ్ కూడా గెలకుండానే ఇంటి ముఖం పట్టిన బంగ్లాదేశ్

  • టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్
  • చివరి లీగ్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఓటమి
  • గ్రూప్-1లో ఐదు మ్యాచ్ ల్లోనూ పరాజయం
  • రెండోస్థానానికి ఎగబాకిన ఆసీస్
టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ దారుణమైన రీతిలో నిష్క్రమించింది. సూపర్-12 దశలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. నేడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గ్రూప్-1లో బంగ్లాదేశ్ కు ఇదే చివరి మ్యాచ్. ఐదు మ్యాచ్ లు ఆడి ఐదింట్లోనూ ఓటమిపాలైంది.

నేటి మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా 6.2 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 40 పరుగులు చేశాడు. వార్నర్ 18, మిచెల్ మార్ష్ 16 (నాటౌట్) పరుగులు సాధించారు. మార్ష్ ఓ సిక్సర్ తో ఆస్ట్రేలియాను గెలుపుతీరాలకు చేర్చాడు.

ఈ విజయంతో ఆస్ట్రేలియా గ్రూప్-1లో రెండో స్థానానికి ఎగబాకింది. ఆసీస్ సూపర్-12 దశలో ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు సాధించింది. దక్షిణాఫ్రికా కూడా 4 మ్యాచ్ ల్లో 3 విజయాలు సాధించినా నెట్ రన్ రేట్ ఆసీస్ దే ఎక్కువగా ఉంది.


More Telugu News