దీపావళి కానుకగా 'నరకాసుర' ఫస్ట్ లుక్!
- రక్షిత్ అట్లూరి హీరోగా 'నరకాసుర'
- కథానాయికగా అపర్ణ జనార్దన్
- దర్శకుడిగా సెబీ జూనియర్
- ఫిబ్రవరిలో విడుదల
రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నరకాసుర'. ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతూ దర్శకత్వం వహించారు సెబి జూనియర్. ఐడియల్ ఫిల్మ్ మేకర్, సుముఖ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎ శ్రీనివాస్, ఎ రాఘవేందర్, కరుమూరు రఘు, సెబి జూనియర్ నిర్మిస్తున్నారు. అపర్ణ జనార్దన్ నాయిక. సంకీర్తన విపిన్ మరో నాయికగా నటిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా 'నరకాసుర' మూవీ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. ఢమరుకాన్ని పట్టుకున్న హీరో రక్షిత్ అట్లూరి తీక్షణంగా చూస్తున్న ఈ ఫస్ట్ లుక్ ఇంటెన్స్ గా ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు సెబి జూనియర్ మాట్లాడుతూ..." ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ, పెప్పర్ తోట నేపథ్యంగా నరకాసుర కథ సాగుతుంది. ఈ తోటలో పనిచేసే రైతు, ట్రక్ డ్రైవర్ అదృశ్యం అవుతారు. వారిని వెతికే క్రమంలో కథ అనేక ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఆ ట్విస్ట్స్ ఏంటి అనేది నరకాసుర సినిమాలో చూడాలి. చింతపల్లి, కోరాపుట్, జబల్ పూర్ వంటి లొకేషన్లలో షూటింగ్ చేశాం. చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం" అన్నారు.
శత్రు, నాజర్, చరణ్ రాజ్, శ్రీమాన్, ఎస్ ఎస్ కాంచి, గాయత్రి రవిశంకర్, తేజ్ చరణ్ రాజ్, కార్తీక్, ఫిష్ వెంకట్, మస్త్ అలీ, భాను తేజ, లక్ష్మణ్, రాము, దేవాంగన నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - నాని చమిడిశెట్టి, సంగీతం - ఎఐఎస్ నౌఫల్ రాజా, ఎడిటర్ - సిహెచ్ వంశీకృష్ణ, మేకప్ అండ్ ప్రోస్తటిక్స్ - రషీద్ అహ్మద్, కొరియోగ్రఫీ - పోలకి విజయ్, యాక్షన్ - రాబిన్ సుబ్బు, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతలు - ఎ శ్రీనివాస్, ఎ రాఘవేందర్, కరుమూరు రఘు, సెబి జూనియర్. రచన, దర్శకత్వం - సెబి జూనియర్ .
ఈ సందర్భంగా దర్శకుడు సెబి జూనియర్ మాట్లాడుతూ..." ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ, పెప్పర్ తోట నేపథ్యంగా నరకాసుర కథ సాగుతుంది. ఈ తోటలో పనిచేసే రైతు, ట్రక్ డ్రైవర్ అదృశ్యం అవుతారు. వారిని వెతికే క్రమంలో కథ అనేక ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఆ ట్విస్ట్స్ ఏంటి అనేది నరకాసుర సినిమాలో చూడాలి. చింతపల్లి, కోరాపుట్, జబల్ పూర్ వంటి లొకేషన్లలో షూటింగ్ చేశాం. చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం" అన్నారు.
శత్రు, నాజర్, చరణ్ రాజ్, శ్రీమాన్, ఎస్ ఎస్ కాంచి, గాయత్రి రవిశంకర్, తేజ్ చరణ్ రాజ్, కార్తీక్, ఫిష్ వెంకట్, మస్త్ అలీ, భాను తేజ, లక్ష్మణ్, రాము, దేవాంగన నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - నాని చమిడిశెట్టి, సంగీతం - ఎఐఎస్ నౌఫల్ రాజా, ఎడిటర్ - సిహెచ్ వంశీకృష్ణ, మేకప్ అండ్ ప్రోస్తటిక్స్ - రషీద్ అహ్మద్, కొరియోగ్రఫీ - పోలకి విజయ్, యాక్షన్ - రాబిన్ సుబ్బు, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతలు - ఎ శ్రీనివాస్, ఎ రాఘవేందర్, కరుమూరు రఘు, సెబి జూనియర్. రచన, దర్శకత్వం - సెబి జూనియర్