సింగిల్ క్యారెక్టర్ తో ఒకే షాట్ లో సినిమా... హన్సిక '105 మినిట్స్' చిత్రం అరుదైన ఘనత
- ప్రయోగాత్మక చిత్రంలో నటించిన హన్సిక
- రాజు దుస్సా దర్శకత్వంలో '105 మినిట్స్'
- గ్లింప్స్ వీడియో ఆవిష్కరించిన సెంథిల్ కుమార్
- హాలీవుడ్ టెక్నిక్ అంటూ కితాబు
పాలబుగ్గల సుందరి హన్సిక మోత్వానీ ప్రస్తుతం '105 మినిట్స్' అనే ప్రయోగాత్మక చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే... ఇందులో ఉండేది ఒకటే పాత్ర. పైగా ఈ చిత్రాన్ని ఒకే షాట్ లో రూపొందించడం మరో విశేషం. భారతీయ చలనచిత్ర రంగంలో ఇలాంటి సినిమా ఎన్నడూ రాలేదు. తాజాగా '105 మినిట్స్' గ్లింప్స్ వీడియోను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె. కె. సెంథిల్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సెంథిల్ కుమార్ మాట్లాడుతూ, హాలీవుడ్ లో మాత్రమే ప్రయత్నించిన సింగిల్ షాట్ చిత్రీకరణకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. ఆ టెక్నిక్ తో మనవాళ్లెవరు చెయ్యట్లేదు అనుకుంటుండగా '105 మినిట్స్'తో డైరెక్టర్ రాజు దుస్సా చేసి చూపిస్తున్నారని కొనియాడారు. కథ, కథనం చాలా థ్రిల్లింగ్ గా అనిపించాయని వెల్లడించారు.
"సింగిల్ షాట్ లో సినిమా అంటే ఒక టెక్నీషియన్ గా అది ఎంత కష్టమో నాకు తెలుసు. మన తెలుగు పరిశ్రమలో ఇలాంటి కొత్త తరం ఆలోచనతో కథలు తెరకెక్కిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక రిస్కీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ధైర్యం ఉండాలి. తాము అనుకున్నది అనుకున్నట్టుగా తీసిన చిత్ర బృందం అంతటికి ఈ చిత్రం పెద్ద సక్సెస్ ను ఇవ్వాలని కోరుకుంటున్నాను" అన్నారు.
రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. సామ్ సి.యస్ సంగీతం అందిస్తున్నారు. ఈ '105 మినిట్స్' చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.