కరోనా వల్ల యూరప్ లో నాలుగు నెలల్లో లక్షలాది మంది చనిపోతారు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • యూరోపియన్ రీజియన్ లో కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన
  • ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల మంది చనిపోతారని వ్యాఖ్య
  • కరోనా వ్యాప్తి కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచన
ప్రపంచంపై కరోనా మహమ్మారి ఇంకా పంజా విసురుతూనే ఉంది. కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ... మరికొన్ని దేశాల్లో నమోదవుతున్న కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూరప్ లో పెరుగుతున్న కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

యూరోపియన్ రీజియన్ పరిధిలో ఉన్న 53 దేశాల్లో ప్రస్తుతం కరోనా వ్యాపిస్తున్న తీరును పరిశీలిస్తే... వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా మరో 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని సంచలన విషయాన్ని వెల్లడించింది. కరోనా వ్యాప్తి కట్టడికి తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. డబ్ల్యూహెచ్ఓ యూరోపియన్ రీజియన్ లో 53 దేశాలు, టెర్రిటరీలతో పాటు మధ్య ఏసియాలో కొన్ని దేశాలు కూడా ఉన్నాయి.


More Telugu News