సీమ టపాకాయలకు సౌండ్ తక్కువ... తుక్కు ఎక్కువ: వైసీపీ నేతలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్
- దీపావళి నేపథ్యంలో గోరంట్ల విమర్శలు
- పన్నుల బాంబు పేలిందని వెల్లడి
- రాష్ట్ర అప్పుల చక్రం భూ చక్రంలా తిరిగిందని ఎద్దేవా
- తాడేపల్లి ఇంటికే మతాబుల వెలుగులు అంటూ వ్యాఖ్యలు
దీపావళి నేపథ్యంలో వైసీపీ నేతలపై మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ అభివృద్ధి తారాజువ్వలాగా ఎగురుతుంది అనుకుంటే అలా జరగలేదని పేర్కొన్నారు. పన్నుల బాంబు మాత్రం బాగా పేలిందని, భూ చక్రం తిరిగినట్టు రాష్ట్ర అప్పుల చక్రం బాగా తిరిగిందని వ్యంగ్యం ప్రదర్శించారు.
సీమ టపాకాయలు సౌండ్ తక్కువ, తుక్కు ఎక్కువ అన్నట్టు వైసీపీ నేతల తీరుతెన్నులు షరా మామూలేనని ఎద్దేవా చేశారు. మతాబుల వెలుగులు తాడేపల్లి ఇల్లుకే కానీ రాష్ట్రంలో లేవని విమర్శించారు. సాధారణంగా దీపావళికి దీపాలు వెలిగిస్తుంటారని, కానీ రాష్ట్రంలో కరెంటు చార్జీల బాదుడు వల్ల ఎప్పుడూ దీపాలు వెలిగించుకునే పరిస్థితి తీసుకువచ్చారని బుచ్చయ్య చౌదరి దెప్పిపొడిచారు.