దేశ వ్యాప్తంగా అంబ‌రాన్నంటేలా దీపావళి వేడుక‌లు.. ఫొటోలు ఇవిగో

  • జ‌మ్మూక‌శ్మీర్‌లో సైనికుల‌తో క‌లిసి మోదీ దీపావ‌ళి
  • యూపీలో యోగి ఆదిత్య‌నాథ్ పూజ‌లు
  • బాణ‌సంచా దుకాణాల్లో ర‌ద్దీ
  • గోవాలోని ప‌నాజీలో న‌ర‌కాసురుడి బొమ్మ ద‌హ‌నం
దేశ వ్యాప్తంగా అంబ‌రాన్నంటేలా ప్ర‌జ‌లు దీపావ‌ళి వేడుక‌లు జ‌రు‌పుకుంటున్నారు. దేవాల‌యాలు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ టపాసులు కాల్చుతూ పండుగ జ‌రుపుకుంటున్నారు. సాయంత్రం దాటాక బాణసంచా వెలుగులను విరజిమ్మడానికి మ‌రింత ఉత్సాహంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు దీపావ‌ళి సంద‌డి క‌న‌ప‌డుతోంది.  

గోవాలోని ప‌నాజీలో న‌ర‌కాసురుడి బొమ్మ‌ను త‌గులబెట్టారు. యూపీలోని దేవాలయాల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్ పూజ‌లు చేశారు.  బాణ‌సంచా దుకాణాల్లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జ‌రుపుతున్నారు.  పండుగ వేళ ఢిల్లీ యూత్ కాంగ్రెస్.. చిన్నారుల‌కు దుస్తులు, మిఠాయిలు పంచిపెట్టింది


            
                  జ‌మ్మూక‌శ్మీర్‌లో సైనికుల‌తో క‌లిసి మోదీ దీపావ‌ళి వేడుక జ‌రుపుకున్నారు
                   దీపావ‌ళి సంద‌ర్భంగా యూపీలోని అయోధ్య‌లో  హుమాన్ గ‌ర్హీలో భ‌క్తుల పూజ‌లు

                         అయోధ్య రామ‌మందిరం ప్రాంతంలో పెద్ద ఎత్తున విద్యుద్దీపాల‌తో అలంక‌ర‌ణ‌లు చేశారు




More Telugu News