మొత్తానికి మెగాస్టార్ ను మెప్పించాను: మారుతి
- మెగాస్టార్ కి ఒక లైన్ చెప్పాను
- ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది
- ఆ స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది
- తన మార్క్ కామెడీ ఉంటుందన్న మారుతి
మారుతి తన కెరియర్ ఆరంభంలో యూత్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసేవాడు. ఆ తరువాత మెల్లగా ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తన సినిమాలకి వచ్చేలా కథలను మార్చుకుంటూ వచ్చాడు. వినోదానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నాడు.
ఆయన తాజా చిత్రమైన 'మంచిరోజులు వచ్చాయి' ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక గోపీచంద్ తో చేస్తున్న 'పక్కా కమర్షియల్' కూడా ముగింపుదశకి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే మారుతి - చిరంజీవి కాంబినేషన్లో ఒక సినిమా ఉండనుందనే టాక్ వచ్చింది. తాజాగా ఆ విషయాన్ని మారుతి ధ్రువీకరించాడు.
చిరంజీవిగారికి తాను ఒక లైన్ చెప్పాననీ .. ఆయనకి బాగా నచ్చిందని అన్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై కూర్చున్నానని చెప్పాడు. తన మార్క్ కామెడీతో పాటు చిరంజీవిగారి నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ కథలో పుష్కలంగా ఉంటాయని చెప్పేసి క్లారిటీ ఇచ్చేశాడు. ఏడాది తరువాత ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.