ఒడిశా పర్యటనకు వెళుతున్న సీఎం జగన్
- ఈ నెల 9న భువనేశ్వర్ లో పర్యటించనున్న జగన్
- ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న సీఎం
- జల వివాదాలపై చర్చించనున్న ఇరువురు ముఖ్యమంత్రులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒడిశా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 9న ఆయన ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల జల వివాదాల గురించి ఈ సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
ఇరు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో వివాదం నడుస్తోంది. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి గతంలోనే నవీన్ పట్నాయక్ కు జగన్ లేఖ రాశారు. ఈ బ్యారేజ్ నిర్మాణంతో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలు కలుగుతుందని లేఖలో జగన్ పేర్కొన్నారు. ఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని చెప్పారు. తన ఒడిశా పర్యటనలో నవీన్ పట్నాయక్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను కూడా జగన్ కలవనున్నారు.