ఉల్లి ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం

  • ధ‌ర‌లు త‌గ్గించేందుకు చేస్తోన్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం
  • మార్కెట్లో కిలో రూ.40.13
  • వానాకాలంలో  భారీ వ‌ర్షాల వ‌ల్ల గ‌త నెల ధ‌ర‌ల పెరుగుద‌ల‌
  • బఫర్‌ నిల్వల నుంచి ఉల్లిని సరఫరా చేశాం 
ఉల్లి ధ‌ర‌ల ఘాటును త‌గ్గించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయ‌ని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉల్లి ధ‌ర‌ల‌కు సంబంధించిన ప‌లు వివ‌రాలు తెలిపింది. ప్రస్తుతం ఉల్లిగడ్డల రేటు రిటైల్‌, హోల్‌సేల్‌ మార్కెట్లో కిలో రూ.40.13గా ఉందని వివ‌రించింది. ఇటీవలి వానాకాలంలో కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల్ల గ‌త నెల‌ మొదటివారం నుంచి ఉల్లిపాయల ధరలు పెరిగాయ‌ని వివ‌రించింది.

అయితే, తాము తీసుకున్న చ‌ర్య‌ల ఫ‌లితంగా ధ‌ర‌లు త‌గ్గాయ‌ని చెప్పింది. బఫర్‌ నిల్వల నుంచి ఉల్లిని సరఫరా చేశామని వివ‌రించింది. బ‌ఫ‌ర్ నిల్వ‌ల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు హైదరాబాద్‌, ఢిల్లీతో పాటు కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, బెంగళూరు, చెన్నై, ముంబై త‌దిత‌ర మార్కెట్లకు 1,11,376.17 మెట్రిక్‌ టన్నుల ఉల్లి సరఫరా చేశామని వివ‌రించింది. రాష్ట్రాలకు కిలో ఉల్లి రూ.21కు ఇవ్వడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ సిద్ధమైందని తెలిపింది.


More Telugu News