ఓ స్టార్ హీరో నాతో నటించడానికి ఇష్టపడలేదు: తాప్సీ

  • హీరోయిన్లకు పేరొచ్చే సినిమాల్లో నటించేందుకు హీరోలు ఇష్టపడరు
  • ఓ సినిమాలో నాది డబుల్ రోల్
  • నాతో నటించేందుకు ఓ స్టార్ హీరో అభద్రతగా ఫీల్ అయ్యాడు
హీరోయిన్లకు పేరు వచ్చే సినిమాల్లో నటించేందుకు చాలా మంది హీరోలు ఇష్టపడరని నటి తాప్సీ తెలిపింది. సినిమాల్లో పురుషాధిక్యత గురించి ఆమె మాట్లాడుతూ... ఒక సినిమాలో తనది డబుల్ రోల్ అని... ఆ సినిమాలో హీరో పాత్ర కోసం ఒక టాప్ యాక్టర్ ను నిర్మాతలు సంప్రదించారని... అయితే సదరు హీరో ఒప్పుకోలేదని చెప్పింది.

వాస్తవానికి ఆయన తనతో అంతకు ముందే ఒక సినిమాలో నటించాడని తెలిపింది. ఆయన పెద్ద స్టార్ అని... అయినా తనతో నటించడానికి ఆయన అభద్రతగా ఫీల్ కావడం బాధాకరమని వ్యాఖ్యానించింది. ఒకట్రెండు సినిమాలు చేసిన హీరోలు కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదని చెప్పింది. ప్రేక్షకుల మార్కులు హీరోయిన్ పాత్రకు పడతాయనే వారు ఆ సినిమా చేయడానికి ఇష్టపడలేదని తెలిపింది.


More Telugu News