'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ.. ఫస్ట్ పోస్టర్ విడుదల!
- 70వ దశకంలో స్టువర్టుపురం దొంగల ముఠా
- గడగడలాడించిన 'టైగర్' నాగేశ్వరరావు
- పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన టైగర్
- వంశీ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ
టాలీవుడ్ లో మరో బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. దోపిడీలలో ఒకప్పుడు సంచలనం రేపిన ముఠా 'స్టువర్టుపురం దొంగల ముఠా'. ఏపీలోనే కాకుండా, సరిహద్దు రాష్ట్రాలలో కూడా తమ దొంగతనాలు, దోపిడీలతో గడగడలాడించిన ఈ ముఠాకు ఓ నాయకుడైన నాగేశ్వరరావు పేరు అప్పట్లో బాగా వినిపించేది. దోపిడీలలో అతని సాహసాలకు 'టైగర్' అనే బిరుదు కూడా వచ్చేసింది.
గత శతాబ్దం 70వ దశకంలో ఎన్నో దోపిడీలు చేస్తూ.. పోలీసులకు దొరకకుండా.. వాళ్లను ముప్పుతిప్పలు పెట్టిన 'టైగర్ నాగేశ్వరరావు' చివరకు పోలీసుల ఎన్ కౌంటర్ లోనే మరణించాడు. ఇప్పుడితని కథను టైగర్ నాగేశ్వరరావు పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం ఈ రోజు ఫస్ట్ పోస్టర్ ను వదిలింది.
వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నాలుగు భాషలలో నిర్మిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు జీవితంలోని మరో కోణాన్ని కూడా తీసుకుని, అతని రాబిన్ హుడ్ తరహా నైజాన్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కథానాయిక, ఇతర నటీనటుల వంటి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు. దీనిని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.