ఫాంహౌస్ కేసులో.. హీరో నాగశౌర్య తండ్రిని విచారణకు పిలిచిన పోలీసులు
- మంచిరేవులలో ఫాంహౌస్‌ను లీజుకు తీసుకున్న నాగశౌర్య తండ్రి రవీంద్ర
- అందులో గుత్తా సుమన్ అనే వ్యక్తి జూదం నిర్వహణ
- ఫాంహౌస్ రెంటల్ అగ్రిమెంట్ ను తీసుకురావాలని పోలీసుల ఆదేశాలు
టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో జూదం నిర్వహిస్తున్నట్లు ఇటీవల పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ను కోర్టు రెండు రోజుల పోలీసుల కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ పాత్రపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫాంహౌస్ రెంటల్ అగ్రిమెంట్ కు సంబంధించిన పత్రాలను తీసుకురావాలని పోలీసులు ఆదేశించారు. దీంతో రవీంద్ర ప్రసాద్ ఈ రోజు పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. కాగా, ఓ ఫాంహౌస్‌ను గతంలో ఓ మాజీ ఉన్నతాధికారి నుంచి నాగశౌర్య తండ్రి రవీంద్ర ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అందులో గుత్తా సుమన్ అనే వ్యక్తి జూదం నిర్వహించడం కలకలం రేపింది. గుత్తా సుమన్‌పై ఏపీలో ఉన్న కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.