'పెద్దన్న' నుంచి 'ఆహా కల్యాణం' లిరికల్ సాంగ్!
- ఊరికి 'పెద్దన్న'గా రజనీకాంత్
- చెల్లెలి సెంటిమెంటుతో సాగే కథ
- కీలకమైన పాత్రలో జాకీ ష్రాఫ్
- రేపు భారీ స్థాయి విడుదల
రజనీకాంత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' సినిమా రూపొందింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, 'అన్నా చెల్లెళ్ల' సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. రజనీకాంత్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. తెలుగులో ఈ సినిమాకి 'పెద్దన్న' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమాను రేపు తమిళ .. తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తెలుగు లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు. "ఆహా కల్యాణం .. ఆనంద నాదస్వరం .. మోత మోగుతోందే, పందిళ్ల బంధుజనం .. ఊరంతా కోలాహలం .. ఊయలూగుతోందే" అంటూ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దంపడుతూ ఈ పాట సాగుతోంది.
ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. కీర్తి సురేశ్ ను ప్రధానంగా చేసుకుని, రజనీ .. ఖుష్బూ .. మీనా తదితరులపై ఈ పాటను కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. నయనతార .. జాకీ ష్రాఫ్ .. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.