అచ్చెన్నాయుడితో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడిపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు
- నిన్న నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల ఆవిష్కరణ
- ఆ ప్రాంతంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ
- నిబంధనలు ఉల్లంఘించారని కేసు
టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడిపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. మరో 48 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కరోనా వేళ వారు నిబంధనలు ఉల్లంఘించారని, అలాగే, మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించారని వీఆర్వో ఆరంగి మల్లేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.