నమీబియా బౌలర్లను చితకబాదిన పాక్ బ్యాట్స్ మెన్

  • అబుదాబిలో పాకిస్థాన్ వర్సెస్ నమీబియా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
  • 20 ఓవర్లలో 2 వికెట్లకు 189 పరుగులు
  • అర్ధసెంచరీలతో అదరగొట్టిన రిజ్వాన్, బాబర్
  • రాణించిన సీనియర్ ఆటగాడు హఫీజ్
పసికూన నమీబియాపై పాకిస్థాన్ టాపర్డార్ వీరవిహారం చేసింది. అబుదాబిలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 189 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ అజాం, మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ నమీబియా బౌలింగ్ ను చీల్చి చెండాడారు.

రిజ్వాన్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ బాబర్ అజాం 49 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసి వీజ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఫకార్ జమాన్ (5) విఫలమైనా, సీనియర్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ 16 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. హఫీజ్ స్కోరులో 5 ఫోర్లు ఉన్నాయి.

ఇన్నింగ్స్ లో ఏ దశలోనూ నమీబియా బౌలర్లు పాక్ బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి తీసుకురాలేకపోయారు. దాంతో పాక్ ఆటగాళ్లు బౌండరీల మోత మోగించారు.


More Telugu News