హుజూరాబాద్ ఫలితం, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాణికం ఠాగూర్ స్పందన!
- ఎన్నికల ఫలితంపై సమీక్ష నిర్వహిస్తాం
- పార్టీలో చర్చించిన తర్వాతే స్పందిస్తా
- కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఇంకా చూడలేదు
హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు దాదాపు ఖరారయింది. ఈ ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగింది. మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఎక్కడా కూడా సీన్ లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ మాట్లాడుతూ... ఎన్నికల ఫలితంపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.
పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ కు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను ఇంకా చూడలేదని చెప్పారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత స్పందిస్తానని అన్నారు. బీజేపీకి కాంగ్రెస్ సహకరించిందని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పారు.