నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 109 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 40 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3.44 శాతం నష్టపోయిన టాటా స్టీల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమైనా... ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులకు గురయ్యాయి. చివరికి ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 60,029కి పడిపోయింది. నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 17,888 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (2.26%), టైటాన్ కంపెనీ (1.81%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.30%), ఎల్ అండ్ టీ (1.18%), భారతి ఎయిర్ టెల్ (0.51%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.44%), టెక్ మహీంద్రా (-2.03%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.44%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.33%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.32%).


More Telugu News