బద్వేలులో అందుకే వైసీపీ గెలిచింది: కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ
- ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే పరిస్థితులు లేవు
- రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఉన్నాయి
- వైసీపీ మంత్రులందరూ వచ్చి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టారు
- వైసీపీ నేతలు డబ్బు, మద్యం పంచారు.. దొంగ ఓట్లు వేయించుకున్నారు
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ విజయం ఖరారైన విషయం తెలిసిందే. దీంతో ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ ప్రదర్శించిన తీరుపై విమర్శలు గుప్పించారు.
'ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే పరిస్థితులు లేవు. రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నేను ఓకే ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగనివ్వలేదు' అని కమలమ్మ నిలదీశారు.
'నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే ప్రజల అభిప్రాయం ఏంటో మీకు కూడా తెలుస్తుంది కదా? వైసీపీ మంత్రులందరూ వచ్చి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టారు. వైసీపీ నేతలు డబ్బు, మద్యం పంచారు. ఉప ఎన్నికలో అక్రమాలకు పాల్పడ్డారు. అందుకే ఆ పార్టీ గెలిచింది. ప్రజలు నన్ను బాగా ఆదరించారు. కానీ, ఉప ఎన్నిక ఫలితాలు మాత్రం వేరుగా వచ్చాయి' అని కమలమ్మ వాపోయారు.