హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితాలు: ఐదు రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో ఈట‌ల రాజేంద‌ర్

  • ఐదో రౌండ్‌లో బీజేపీకి 4,358 ఓట్లు
  • టీఆర్ఎస్‌కు 4,014, కాంగ్రెస్‌కు 132 ఓట్లు
  • మొత్తం ఐదు రౌండ్ల‌లో క‌లిపి ఈట‌ల‌కు 2,169 ఓట్ల ఆధిక్యం
  • బీజేపీ అభ్య‌ర్థికి మొత్తం 22,327 ఓట్లు
తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొన‌సాగుతోంది. ప్ర‌తి రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధిక్య‌త క‌న‌బ‌ర్చుతున్నారు. ఐదో రౌండ్ లోనూ ఆయ‌న స్వ‌ల్ప‌ ఆధిక్యం సాధించారు. ఐదో రౌండ్‌లో ఆయ‌న‌కు 344 ఓట్ల ఆధిక్యం ద‌క్కింది. ఐదో రౌండ్‌లో బీజేపీకి 4,358 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,014 ఓట్లు, కాంగ్రెస్‌కు 132 ఓట్లు ద‌క్కాయి.

మొత్తం ఐదు రౌండ్ల‌లో క‌లిపి ఆయ‌న 2,169 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 5 రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ అభ్య‌ర్థికి మొత్తం 22,327, టీఆర్ఎస్ అభ్య‌ర్థికి 20,158, కాంగ్రెస్ అభ్య‌ర్థికి 680 ఓట్లు ద‌క్కాయి. ఈట‌ల గెలిచే అవ‌కాశాలు ఉండ‌డంతో ఆ పార్టీ శ్రేణులు సంబ‌రాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


More Telugu News