బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీకి భారీ మెజార్టీతో విజ‌యం ఖ‌రారు.. వైసీపీ శ్రేణుల సంబ‌రాలు

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీకి భారీ మెజార్టీతో విజ‌యం ఖ‌రారు.. వైసీపీ శ్రేణుల సంబ‌రాలు
  • వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి డాక్టర్‌ దాసరి సుధకు భారీ మెజార్టీ   
  • ఎనిమిది రౌండ్లు ముగిసేసరికే వైసీపీకి మొత్తం 84,682 ఓట్లు
  • బీజేపీకి 16,190 ఓట్లు
  • 68,492 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి డాక్టర్‌ దాసరి సుధ విజ‌యం ఖ‌రారైంది. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి వైసీపీకి మొత్తం 84,682 ఓట్లు, బీజేపీకి 16,190 ఓట్లు వ‌చ్చాయి. అలాగే, కాంగ్రెస్‌కు 5,026 ఓట్లు, నోటాకు 2,830 ఓట్లు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఎనిమిదవ రౌండ్‌లో వైసీపీకి 9,691 ఓట్లు, బీజేపీకి 1,964 ఓట్లు, కాంగ్రెస్‌కు 774, నోటాకు 364 ఓట్లు ద‌క్కాయి. ఎనిమిది రౌండ్లు ముగిసే స‌రికే వైసీపీ 68,492 ఓట్ల ఆధిక్యంలో ఉండ‌డంతో ఆ పార్టీ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. ఓట్ల లెక్కింపు తుది ద‌శ‌లో ఉంది. ఇప్ప‌టికే పూర్తి ఆధిక్యంలో సుధ ఉండ‌డంతో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు మొద‌లు పెట్టారు.


More Telugu News