తెలంగాణలో మరింత దిగొచ్చిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య
- రాష్ట్రంలో 3,974 మందికి కొనసాగుతున్న చికిత్స
- గత 24 గంటల్లో 35,326 కరోనా పరీక్షలు
- 160 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 59 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య 3,974గా ఉంది. గత 24 గంటల్లో 35,326 కరోనా పరీక్షలు నిర్వహించగా, 160 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 59 కొత్త కేసులు నమోదు కాగా... కరీంనగర్ జిల్లాలో 13, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో 11 కేసుల చొప్పున గుర్తించారు. నిర్మల్, నారాయణపేట, కామారెడ్డి, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 193 మంది కరోనా నుంచి కోలుకోగా... ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,958కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,623 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,63,691 మంది ఆరోగ్యవంతులయ్యారు.