రేపు 'హుజూరాబాద్' ఓట్ల లెక్కింపు... సాయంత్రం 4 గంటలకు ఫలితం వెల్లడయ్యే అవకాశం
- హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఆసక్తి
- ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక
- బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల
- ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిన సంగతి విదితమే. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నిక అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. అక్టోబరు 30న పోలింగ్ నిర్వహించారు. రేపు (నవంబరు 2) ఓట్ల లెక్కింపునకు అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ షురూ కానుంది. 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు సాగనుంది. 14 టేబుళ్ల వద్ద ఓట్లు లెక్కించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటల సమయానికి ఫలితం వెల్లడి అవుతుందని భావిస్తున్నారు.
హుజూరాబాద్ బరిలో ఈటల రాజేందర్ బీజేపీ తరఫున బరిలో దిగగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ తరఫున వెంకట్ బల్మూరి పోటీపడ్డారు.
హుజూరాబాద్ బరిలో ఈటల రాజేందర్ బీజేపీ తరఫున బరిలో దిగగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ తరఫున వెంకట్ బల్మూరి పోటీపడ్డారు.