టీ20 వరల్డ్ కప్: అజేయ ఇంగ్లండ్ తో శ్రీలంక ఢీ 

  • షార్జాలో జరుగుతున్న మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • సూపర్ ఫామ్ లో ఉన్న ఇంగ్లండ్
  • ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయం
టీ20 వరల్డ్ కప్ లో నేడు ఇంగ్లండ్ తో శ్రీలంక తలపడనుంది. షార్జా క్రికెట్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే జాసన్ రాయ్, జోస్ బట్లర్, బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, ఇయాన్ మోర్గాన్, మొయిన్ అలీలతో కూడిన బలమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ ను లంక బౌలర్లు ఏమేరకు కట్టడి చేస్తారన్నది సందేహాస్పదమే.

లంక బౌలర్లలో స్పిన్నర్ వనిందు హసరంగ ఒక్కడే కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాడు. మిగతా బౌలర్లు కూడా రాణించాల్సి ఉంది. ఇంగ్లండ్ ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్ట్యా లంక ప్రణాళికలు ఫలించడం కష్టమేననిపిస్తోంది. గ్రూప్-1లో ఉన్న ఈ రెండు జట్లు చెరో మూడు మ్యాచ్ లు ఆడాయి. సూపర్-12 దశలో ఇంగ్లండ్ తాను ఆడిన మూడు మ్యాచ్ ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక కేవలం ఒక మ్యాచ్ లోనే నెగ్గింది.


More Telugu News