'రాజా విక్రమార్క' నుంచి ట్రైలర్ రిలీజ్!

  • కార్తికేయ హీరోగా 'రాజా విక్రమార్క'
  • యాక్షన్ కామెడీ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా తాన్య రవిచంద్రన్ 
  • ఈ నెల 12వ తేదీన విడుదల
కార్తికేయ కథానాయకుడిగా దర్శకుడు శ్రీ సరిపల్లి 'రాజా విక్రమార్క' సినిమాను రూపొందించాడు. 88 రామారెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, కార్తికేయ సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ అలరించనుంది. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, రొమాంటిక్ యాక్షన్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి నాని చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ముఖ్యమైన పాత్రలన్నింటి కాంబినేషన్లోని సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. లవ్ .. యాక్షన్ .. కామెడీని కలిపి అల్లుకున్న కథగా ఈ సినిమా కనిపిస్తోంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

"ఎలకను పట్టుకోవాలంటే వెనకబడనక్కర లేదురా .. ఎరగా ఉల్లిపాయను పెడితే చాలు" .. "నువ్వు తెలివైనవాడివని అనుకునేలోపే ఎంత ఎదవ్వో గుర్తు చేస్తావ్" అనే డైలాగులు సరదాగా అనిపిస్తున్నాయి. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ, ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.


More Telugu News