తెలంగాణలో 12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
- తెలంగాణలో పూర్తిగా చల్లబడిన వాతావరణం
- పలు జిల్లాల్లో వణికిస్తున్న చలి
- రానున్న రోజుల్లో మరింతగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పూర్తిగా మారిపోయాయి. వాతారణం పూర్తిగా చల్లబడింది. గత మూడు రోజుల నుంచి రాత్రి పూట చలి తీవ్రంగా ఉంటోంది. కొన్ని జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణశాఖ విడుదల చేసిన డేటా ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో అత్యల్పంగా 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
బోథ్, బజర్హత్నూర్ లలో 12.6 డిగ్రీలు, గడిగూడలో 12.8 డిగ్రీలు, కేరమేరిలో 12.9 డిగ్రీలు, పొచర, తలమడుగులో 13, సిర్పూర్ లో 13.1, రామ్ నగర్, థాంసీలలో 13.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ తో పాటు పలు ఇతర జిల్లాల్లో కూడా చలి వణికిస్తోంది. రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని అధికారులు తెలియజేశారు.