ఇండియా న‌దుల‌ను కలుషితం చేస్తున్న చైనా

  • అరుణాచల్ ప్రదేశ్ లోకి వస్తున్న నదులను కలుషితం చేస్తున్న చైనా
  • కట్టడాల వ్యర్థాలను నదిలో కలిపేస్తున్న వైనం
  • నల్లగా మారిపోయిన కామెంగ్ నది
సరిహద్దుల్లో రెచ్చగొట్టే ప్రయత్నాలను చేస్తూ... అనునిత్యం ఉద్రిక్తతలను పెంచిపోషించే చైనా... భారత్ ను దెబ్బతీసేందుకు సరికొత్త కుట్రలకు పాల్పడుతోంది. చైనా నుంచి ఇండియాలోకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించే నదులను కలుషితం చేస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనా... ఆ ప్రాంతాంతో పెద్ద ఎత్తున నిర్మాణాలను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కట్టడాల వ్యర్థాలను ఆ దేశం కామెంగ్ నదిలో కలిపేస్తోంది. ఈ వ్యర్థాల కారణంగా నదిలోని పరిశుభ్రమైన నీరు మొత్తం నల్లగా మారిపోయింది. నీరు దేనికీ పనికి రాకుండా తయారైపోయింది.

వాస్తవానికి నీటిలో కరిగే వ్యర్థాల పరిమాణం 300 నుంచి 1200 మిల్లీ గ్రాముల వరకు ఉండొచ్చు. అయితే చైనా చేస్తున్న పనులతో కామెంగ్ నదిలో కరుగుతున్న వ్యర్థాలు 6,800 మిల్లీగ్రాముల వరకు ఉంటోంది. దీనిపై భారత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయి కలుషితాల వల్ల నదిలో చేపలు, ఇతర జీవులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతాయి.


More Telugu News