దారుణంగా ఓడిపోయిన టీమిండియా... సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
- టీ20 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్
- 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జయభేరి
- 49 పరుగులు సాధించిన కివీస్ ఓపెనర్ మిచెల్
- బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమైన భారత ఆటగాళ్లు
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. సూపర్-12 దశ మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన భారత్... తాజాగా న్యూజిలాండ్ చేతిలోనూ భంగపడింది. దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ పై కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. భారత్ విసిరిన 111 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే ఛేదించారు.
ఓపెనర్ డారిల్ మిచిల్ 49 పరుగులు చేయగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (33 నాటౌట్) తనదైన శైలిలో ఇన్నింగ్స్ నడిపించాడు. డారిల్ మిచెల్ స్కోరులో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. అంతకుముందు సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 20 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత మిచెల్, విలియమ్సన్ జోడీ స్కోరు బోర్డును ముందుకు ఉరికించారు. మిచెల్ అవుటైనా... కాన్వేతో కలిసి విలియమ్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. చాన్నాళ్ల తర్వాత బౌలింగ్ వేసిన హార్దిక్ పాండ్య ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
ఈ మ్యాచ్ లో ఓటమి అనంతరం టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిన భారత్ కు, ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.