ప్రపంచంలోనే ఈ గ్రామంలో ముస్లింలు ఎంతో ప్రత్యేకం... ఎందుకంటే...!
- అరబిక్ లో నమాజ్ ఆచరించడం సర్వసాధారణం
- కర్ణాటకలోని ఓ గ్రామంలో అందుకు భిన్నం
- కన్నడ భాషలోనే ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
- 150 ఏళ్లుగా ఇదే సంప్రదాయం
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అరబిక్ భాషలోనే తమ పవిత్ర ప్రార్థనలు చేస్తారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ కర్ణాటకలోని హవేరీ జిల్లా చిక్కా కబ్బర్ గ్రామంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఊర్లో ముస్లింలు అరబిక్ భాషకు బదులుగా కన్నడలోనే నమాజ్ ఆచరిస్తారు. ఇక్కడి హజ్రత్ మెహబూబ్ దర్గా ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ప్రార్థనలు కన్నడ భాషలోనే నిర్వహిస్తారు.
ఈ గ్రామంలో దాదాపు 400 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. గత 150 ఏళ్లుగా వీరు కన్నడ భాషలోనే నమాజ్ చేస్తుండడం విశేషం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరు ముస్లింలే అయినా వీరికి ఉర్దూ కానీ, అరబిక్ కానీ తెలియవు. దాంతో ఇక్కడి మతగురువు రోజుకు ఐదుసార్లు కన్నడ భాషలోనే నమాజుకు పిలుపునిస్తాడు. ఈ దర్గా వెలుపలి బోర్డులు కూడా కన్నడ భాషలోనే దర్శనమిస్తాయి.
స్థానిక భాషలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడం పట్ల గర్విస్తున్నామని ఈ గ్రామ ముస్లింలు చెబుతున్నారు. తాము కన్నడలో చేసే ప్రార్థనలను ఇతర మతాలకు చెందినవారు కూడా ఆసక్తిగా వింటుంటారని వారు వెల్లడించారు. అయితే, గత దశాబ్దకాలంగా ఇక్కడి ముస్లిం చిన్నారులు ఉర్దూ నేర్చుకుంటున్నారు.