హుజూరాబాద్ ఉప ఎన్నిక వీవీ ప్యాట్లు తరలించే బస్సులను టీఆర్ఎస్ నేత హోటల్ వద్ద ఆపారు: డీకే అరుణ ఫిర్యాదు
- వీవీ ప్యాట్ల తరలింపుల ప్రక్రియలో అవకతవకలు
- ప్రైవేటు కారులోనూ వీవీ ప్యాట్లను తరలించారు
- ఓ బస్సులోని వీవీ ప్యాట్ బాక్సును కారులో పెట్టారు
- భద్రత లేకుండా ఈవీఎంలను ఎందుకు తరలించారు?
నిన్న తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. అయితే, అనంతరం వీవీ ప్యాట తరలింపుల ప్రక్రియ సమయంలో అవకతవకలు జరిగాయంటూ అధికారులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ్ మీడియాతో మాట్లాడుతూ... ప్రైవేటు కారులోనూ వీవీ ప్యాట్లను తరలించారని తెలిపారు.
అలాగే, వీవీ ప్యాట్లు తరలించే బస్సులను టీఆర్ఎస్ నేత హోటల్ వద్ద ఆపారని ఆమె అన్నారు. ఓ బస్సులోని వీవీ ప్యాట్ బాక్సును కారులో పెట్టారని ఆరోపించారు. అలాగే, భద్రత లేకుండా ఈవీఎంలను ఎందుకు తరలించారని ఆమె నిలదీశారు. ఎన్నిక వేళ అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారని ఆమె ఆరోపణలు గుప్పించారు. ఈ ఘటనలపై విచారణ జరిపించాలని తాము అధికారులను కోరామని వివరించారు.