ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

  • నేడు, రేపు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం
  • నైరుతి బంగాళాఖాతంలో  అల్పపీడనం
  • తమిళనాడు, శ్రీలంక మధ్య ప్రాంతంలో కేంద్రీకృతం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నేడు, రేపు వ‌ర్షాలు పడే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్ప‌డి, సముద్ర మట్టానికి 3.1 కిలో మీట‌ర్ల‌ ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.

ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. ప‌లు చోట్ల‌ భారీ వర్షాలు కూడా కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. అంతేగాక‌, నవంబర్ తొలి వారంలో కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొంది.

నవంబర్‌ రెండో వారంలో బంగాళాఖాతంలో  అల్పపీడనం ఏర్పడనుందని, అది వాయుగుండంగా మారే అవ‌కాశాలూ ఉన్నాయ‌ని పేర్కొంది. అయితే, అది ఏపీ వైపు వస్తుందా? లేక దిశ మార్చుకుని వెళ్తుందా? అన్న విష‌యంపై పూర్తి స‌మాచారం లేద‌ని చెప్పింది.


More Telugu News