నీలోఫర్ ఆసుపత్రిలో దారుణ ఘటన.. రూ.100 ఇవ్వలేదని ఆక్సిజన్ తీసేసిన వార్డుబాయ్.. బాలుడి మృతి
- ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు
- ఆసుపత్రి వద్ద ఆందోళన
- సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఆగ్రహం
హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడు ఆసుపత్రిలో ఆక్సిజన్ మీద చికిత్స తీసుకుంటున్నాడు. అయితే, తనకు రూ.100 ఇవ్వాలని ఆ బాలుడి కుటుంబ సభ్యులను వార్డు బాయ్ కోరాడు. అతడికి కుటుంబ సభ్యులు రూ.100 ఇవ్వలేదు. తమ వద్ద లేవని చెప్పారు. దీంతో కోపంతో వార్డు బాయ్ బాలుడికి ఆక్సిజన్ తీసేశాడు. ఆ ఆక్సిజన్ సిలిండర్‌ను వేరే వారికి అమర్చాడు.
దీంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడికి ఆక్సిజన్ తీసేసిన వార్డు బాయ్‌ని ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారు.