హుజూరాబాద్ ఉప ఎన్నికలో వైచిత్రి.. ఓటు వేయలేకపోయిన బరిలో ఉన్న 20 మంది అభ్యర్థులు
- ఉప ఎన్నికలో పోటీ చేసిన వారిలో 20 మంది స్థానికేతరులు
- కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కూ లేని ఓటు
- ఒక ఉప ఎన్నికలో ఇంతమంది అభ్యర్థులు ఓటు వేయలేకపోవడం ఇదే తొలిసారి
హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో నిలిచిన 30 మంది అభ్యర్థుల్లో 20 మంది అభ్యర్థులు ఓటు వేయలేకపోయారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగరావు సహా 19 మంది అభ్యర్థులు ఉండడం గమనార్హం. వీరందరూ స్థానికేతరులు కావడంతో వారికి ఓటు వేసే అవకాశం దక్కలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేయలేకపోయిన పోయిన వారిలో బల్మూరి వెంకట్ ఒక్కరే ప్రధాన పార్టీ అభ్యర్థి కాగా, మిగతా వారందరూ స్వతంత్రులు, చిన్నాచితకా పార్టీలకు చెందినవారే కావడం గమనార్హం. కాగా, ఒక ఉప ఎన్నికలో ఇంతమంది అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకోలేకపోవడం ఇదే తొలిసారి.