పెంపుడు శునకం చనిపోవడంతో కన్నీటి పర్యంతమైన కొండా సురేఖ
- విషాదంలో కొండా సురేఖ
- పెంపుడు శునకం సోనూ మృత్యువాత
- భోరున విలపించిన కొండా సురేఖ
- సామాజిక మాధ్యమాల్లో వీడియో
మాజీ మంత్రి కొండా సురేఖ తన పెంపుడు శునకం సోనూ మరణించడం పట్ల విషాదానికి లోనయ్యారు. పెంపుడు కుక్కకు కన్నీటి నివాళులు అర్పించారు. తమ కుటుంబంలో కలిసిపోయిన శునకం మృత్యువాతపడడంతో కొండా సురేఖ వేదన వర్ణనాతీతం. ఓ కుటుంబ సభ్యుడు దూరమైనంతగా ఆమె రోదించడం చూపరులను కలచివేసింది. దాన్ని ఒళ్లోకి తీసుకుని ఆమె భోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.