ఇంగ్లండ్ తో గ్రూప్-1 పోరు... ఆస్ట్రేలియా 125 ఆలౌట్

  • ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్
  • దుబాయ్ లో గ్రూప్-1 పోరు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ బౌలర్లు
  • రాణించిన ఆసీస్ సారథి ఫించ్
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఏ వేదికపై తలపడినా ఆ పోరు తీవ్రంగానే ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ లో నేడు ఈ రెండు జట్లు దుబాయ్ వేదికగా పోటీపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా సరిగ్గా 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పోవడంతో భారీ స్కోరు సాధించాలన్న ఆసీస్ ఆశలు నెరవేరలేదు.

ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 49 పరుగుల్లో 44 పరుగులు చేశాడు. ఆస్టన్ అగర్ 20, కమిన్స్ 12, స్టార్క్ 13 పరుగులు సాధించారు. ఆసీస్ లైనప్ లో చివరి వరుస బ్యాట్స్ మెన్ సిక్సర్లు కొట్టడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. అగర్ రెండు సిక్సులు, కమిన్స్ రెండు సిక్సులు, స్టార్క్ ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టారు. వార్నర్ (1) విఫలం కాగా, స్టీవెన్ స్మిత్ (1), మ్యాక్స్ వెల్ (6), స్టొయినిస్ (0) నిరాశపరిచారు.

ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3, క్రిస్ వోక్స్ 2, టైమల్ మిల్స్ 2, అదిల్ రషీద్ 1, లివింగ్ స్టన్ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ జట్టు 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.


More Telugu News