ఇది మామూలు జట్టు కాదు... ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు
- టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ పై పాక్ విజయం
- పాక్ క్రికెటర్ ఆసిఫ్ అలీ సిక్సర్ల హోరు
- పాక్ ప్రధానిని ఆకట్టుకున్న ఆఫ్ఘన్ పోరాటపటిమ
- ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు మెరుగైన భవిష్యత్ ఉందని వెల్లడి
- ఇలాంటి జట్టును ఇంతవరకు చూడలేదంటూ ట్వీట్
నిన్న టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన పోరు రసవత్తరంగా సాగింది. ఓ దశలో ఓటమి అంచున నిలిచిన పాక్... ఆసిఫ్ అలీ సిక్సర్ల వర్షంతో కోలుకుంది. లేకపోతే ఆ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు విజేతగా నిలిచేది. ఆ మ్యాచ్ లో ఓడినా ఆఫ్ఘన్ జట్టు పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఆఫ్ఘన్ జట్టు పోరాటస్ఫూర్తికి ముగ్ధుడయ్యారు. తమ జట్టు గెలిచినప్పటికీ ఆయన ఆఫ్ఘన్లను మనస్ఫూర్తిగా అభినందించారు. ఆఫ్ఘనిస్థాన్ లా ఇంత తక్కువ వ్యవధిలో అంతర్జాతీయస్థాయికి చేరిన జట్టు మరొకటి లేదని పేర్కొన్నారు. ప్రత్యర్థి జట్లకు ఎదురొడ్డి నిలిచే దృక్పథం మెండుగా ఉన్న ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు మెరుగైన భవిష్యత్ ఉందని ట్వీట్ చేశారు. ఇలాంటి జట్టును తాను ఇప్పటివరకు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.