ఫ్రాన్స్ లో కేటీఆర్ ను కలిసిన తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులు

  • ఫ్రాన్స్ లో కేటీఆర్ పర్యటన
  • పెట్టుబడులు రాబట్టడమే అజెండా
  • కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఫ్రాన్స్ తెలుగు సంఘాలు
  • బిజినెస్ ఫోరం సదస్సులో పాల్గొన్న కేటీఆర్
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్రాన్స్, ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ సభ్యులు కలిశారు. పర్యటనను పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంఘాల ప్రతినిధులతో కేటీఆర్ వివిధ అంశాలపై మాట్లాడారు. ఫ్రాన్స్ లో వారి స్థితిగతులను తెలుసుకున్నారు.

ఫ్రాన్స్ లో తన పర్యటన సందర్భంగా కేటీఆర్ యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రస్థానాన్ని వివరించారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోందని, పారిశ్రామిక ప్రగతి పరంగా దేశంలో తెలంగాణనే నెంబర్ వన్ అని వెల్లడించారు.

పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగా తెలంగాణను అభివర్ణించారు. తమ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలంటూ ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వారికి వివరించారు.


More Telugu News