బద్వేలులో దొంగ ఓట్లు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు: ఏపీ సీఈవో విజయానంద్

  • బద్వేలు నియోజకవర్గంలో కొనసాగుతున్న పోలింగ్
  • మధ్యాహ్నం 1 గంట వరకు 35.47 శాతం ఓటింగ్
  • ఇతర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారని ప్రచారం
  • ఖండించిన సీఈవో విజయానంద్
బద్వేలులో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి 35.47 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ రాత్రి 7 గంటల వరకు జరగనుంది. కాగా, బద్వేలు నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేస్తున్నారని, ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తరలిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల్లో నిజంలేదని ఏపీ సీఈవో విజయానంద్ స్పష్టం చేశారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోందని, మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా నిశితంగా పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.


More Telugu News