వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశమైన ప్రధాని మోదీ
- విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ
- ఇటలీలో జీ-20 దేశాల సదస్సు
- పోప్ తో గంట పాటు సమావేశం
- అనేక అంశాలపై చర్చ
ఇటలీలోని రోమ్ లో జరిగే 16వ జీ-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం 20 నిమిషాల పాటు జరగాల్సి ఉన్నా, గంట పాటు కొనసాగింది. ఎంతో సుహృద్భావ వాతావరణంలో ఇరువురి భేటీ జరిగింది.
వాతావరణ మార్పులు, కాలుష్యంపై పోరాటం, దారిద్ర్య నిర్మూలన వంటి అనేక అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. భారత్ లో పర్యటించాలంటూ పోప్ ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. 1999లో అప్పటి పోప్ జాన్ పాల్-II భారత్ లో పర్యటించిన తర్వాత మరే పోప్ భారత్ కు రాలేదు. నాడు ప్రధానిగా అటల్ బిహారీ వాజ్ పేయి ఉన్నారు.