నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారు?: పెళ్లి వార్త‌ల‌పై హీరోయిన్ క‌త్రిన ఆగ్ర‌హం

  • త్వ‌ర‌లోనే పెళ్లి అంటూ ప్ర‌చారం
  • నటుడు విక్కీ కౌశల్ తో ఆమె ఎంగేజ్ మెంట్ జ‌రిగింద‌ని
    వార్త‌లు
  • సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి 15 ఏళ్లు అవుతోంద‌న్న క‌త్రినా
  • అప్ప‌టి నుంచి త‌న పెళ్లి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉందని ఆగ్ర‌హం
  • నెల‌కు ఒక్కో వ్యక్తిని అంట‌గ‌డుతూ పెళ్లి గురించి వార్త‌లు రాస్తున్నార‌ని మండిపాటు
హీరోయిన్ కత్రినా కైఫ్ రహ‌స్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకుందంటూ ఇటీవ‌ల‌ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విష‌యం తెలిసిందే. నటుడు విక్కీ కౌశల్ తో ఆమె ప్రేమలో మునిగితేలుతోంద‌ని, త్వ‌ర‌లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది.

ఓ ఫంక్షన్ లో కత్రినా, విక్కీ కౌశల్ లు ఉంగరాలు మార్చుకున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. వీటిపై క‌త్రినా కైఫ్ స్వ‌యంగా స్పందిస్తూ వాటిని కొట్టిపారేసింది. తాను సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి 15 ఏళ్లు అవుతోంద‌ని, తాను ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌న పెళ్లి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉందని చెప్పింది. నెల‌కు ఒక్కో వ్యక్తిని అంట‌గ‌డుతూ పెళ్లి గురించి వార్త‌లు రాస్తున్నార‌ని మండిప‌డింది.  

నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారు? అంటూ ప్రశ్నించింది. విక్కీ, తాను పెళ్లి చేసుకోవాల‌ని అనుకోలేద‌ని తెలిపింది. ప్ర‌స్తుతానికి అలాంటి ప్ర‌ణాళిక‌లు ఏమీ లేవ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం ఈ భామ చేతిలో 'టైగ‌ర్ 3' సినిమా ఉంది. సల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తోన్న‌ ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్పెషల్ ఏజెంట్ అవినాశ‌క్ సింగ్ రాథోడ్ పాత్రలో స‌ల్మాన్ న‌టిస్తున్నాడు. అలాగే, అక్షయ్‌ కుమార్ తో 'సూర్యవంశీ' సినిమాలోనూ కత్రినా కనిపించనుంది. ఈ సినిమా నవంబర్‌ 5న థియేటర్లలో విడుద‌ల కానుంది.


More Telugu News