హుజూరాబాద్ పోలింగ్‌లో ఉద్రిక్తత.. కౌశిక్ రెడ్డిని నిలదీసిన బీజేపీ నేతలు.. రక్షణగా నిలిచిన పోలీసులు
- పలు పోలింగ్ కేంద్రాల్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ
- ఘన్ముక్లకు వెళ్లిన టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి
- అడ్డుకున్న బీజేపీ నేతలు
- చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌నంటూ ఐడీ కార్డు చూపిన కౌశిక్
- చివరకు వెనక్కు పంపిన పోలీసులు
బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతోన్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. పలు పోలింగ్ కేంద్రాల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణ పడుతున్నారు. మరోపక్క టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఘన్ముక్లకు వచ్చిన ఆ పార్టీ నేత కౌశిక్ రెడ్డిని బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు.
పదేపదే ఘన్ముక్లకు ఎందుకు వస్తున్నారంటూ కౌశిక్‌రెడ్డిని బీజేపీ నేతలు నిలదీశారు. ఆయన దౌర్జన్యాలకు పాల్పడడానికి ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌నంటూ కౌశిక్ రెడ్డి ఐడీ కార్డు చూపారు. తనకు 305 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కిడికైనా వెళ్లే హక్కు ఉందని కౌశిక్ రెడ్డి చెప్పారు. బీజేపీ నేతలు ఫ్రస్టేషన్ తోనే తనను అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు చుట్టుముడుతుండడంతో ఆయనకు రక్షణగా పోలీసు సిబ్బంది నిలిచారు. అనంతరం కౌశిక్ రెడ్డికి పోలీసులు సర్దిచెప్పడంతో ఆయన పోలింగ్ కేంద్రం నుంచి తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు, జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగడం అలజడి రేపింది. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గల 176వ బూత్ వద్ద స్థానికేతరులు ఎందుకు ఉన్నారని బీజేపీ నేతలు నిలదీశారు. అధికారులు ఎన్నికలు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు వెబ్‌కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా పోలీసు యంత్రాంగం పోలింగ్ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.