పునీత్ రాజ్‌కుమార్ కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు
- జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించిన పునీత్
- కళ్లను సేకరించి భద్రపరిచిన ‘నారాయణ నేత్రాలయ’
- నిర్మాతగానూ ప్రతిభ చూపిన పునీత్
- ‘పవర్‌స్టార్’ బిరుదు అభిమానులే ఇచ్చారన్న అభిమాన నటుడు
నిన్న ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందిన కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కళ్లను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. ‘నారాయణ నేత్రాలయ’కు చెందిన వైద్యులు పునీత్ నేత్రాలను సేకరించి భద్రపరిచారు. పునీత్ మరణంతో ఒక్క కన్నడ చిత్ర పరిశ్రమే కాదు.. తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమలు సైతం విషాదంలో మునిగిపోయాయి. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న పలువురు కన్నీరు పెడుతున్నారు.
‘అప్పు’ సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన పునీత్ ఇప్పటి వరకు 29 సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. వీటిలో అత్యధిక సినిమాలు వంద రోజులకుపైగా ఆడాయి. అభిమానులు ఆయనను ‘పవర్ స్టార్’గా పిలుచుకుంటారు. ఈ బిరుదుపై ఒకసారి పునీత్ మాట్లాడుతూ.. పవర్ స్టార్ అనే బిరుదు తనకు అభిమానులే ఇచ్చారని అన్నారు. నిజానికి వారే తన పవర్ అని చెప్పుకొచ్చారు. నటుడిగా, వ్యాఖ్యాతగా, గాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో పునీత్ ఒకరు. నిర్మాతగానూ పునీత్ తనను తాను నిరూపించుకున్నారు. పీఆర్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆరు సినిమాలు నిర్మించారు. ‘లా’, ‘ఫ్రెంచ్ బిర్యానీ’ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలై అభిమానులను అలరించాయి. ‘ఫ్యామిలీ ప్యాక్’, ‘వన్ కట్.. టు కట్.. యాన్ ఫ్లవర్ ఈజ్ కేమ్’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.