కుప్పం సభలో ఆగంతుకుడి కలకలం.... చంద్రబాబును కవర్ చేసిన కమాండోలు
- కుప్పంలో చంద్రబాబు సభ
- అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి
- పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
- గుర్తుతెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. కుప్పంలో భారీ సభ సందర్భంగా ఓ ఆగంతుకుడు కలకలం సృష్టించాడు. చంద్రబాబు సభ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అతడిని టీడీపీ కార్యకర్తలు నిర్బంధించారు. బాంబు తెచ్చేడేమోనన్న అనుమానంతో అతడిని పోలీసులకు అప్పగించారు. అతడి వద్ద రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో, అప్పటివరకు వెనుక నిల్చున్న కమాండోలు ఒక్కసారిగా ముందుకు వచ్చి చంద్రబాబు చుట్టూ కవచంలా నిలిచారు.
ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, బాబాయ్ ని చంపిననోడికి భయం కానీ, మనకెందుకు భయం అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైసీపీ గూండాయిజం నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అటు చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఒకరి ఫ్లెక్సీలను మరొకరు పరస్పరం ధ్వంసం చేసుకున్నారు.