రేవంత్ కు రోజూ రాజకీయాలు కావాలి... అందుకే ఇలా మాట్లాడుతున్నాడు: పేర్ని నాని

  • ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ పెట్టమంటున్నారన్న కేసీఆర్
  • రెండు రాష్ట్రాలను కలిపేయాలన్న పేర్ని నాని
  • తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ రేవంత్ వార్నింగ్
  • కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని
ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ పెట్టమంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొనగా, రెండు రాష్ట్రాలను కలిపేసి కేసీఆర్ ఇక్కడ్నించే పోటీ చేయొచ్చని ఏపీ మంత్రి పేర్ని నాని సలహా ఇవ్వడం తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడుతూ తెలంగాణ జోలికి వచ్చారో ఖబడ్దార్ అంటూ ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

రోజూ రాజకీయాల్లో ఉండాలనుకునేవారు ఇలాగే మాట్లాడతారని విమర్శించారు. రేవంత్ కు రోజూ రాజకీయాలు కావాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏమన్నారో, ఆ వ్యాఖ్యలపైనే తాను మాట్లాడానని పేర్ని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఇలా డొంకతిరుగుడు ఉండదని అన్నారు.

ఏ పార్టీ వారైనా డైరెక్ట్ గా మాట్లాడాలని, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు మాట్లాడకూడదని హితవు పలికారు. తెలంగాణలో ఒక తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని, మళ్లీ కొత్త పార్టీ ఎందుకన్నదే తన అభిప్రాయమని మంత్రి పేర్ని నాని ఉద్ఘాటించారు.


More Telugu News