మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమాపణలు: దర్శకుడు అజయ్ భూపతి

మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమాపణలు: దర్శకుడు అజయ్ భూపతి
  • బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన 'మహా సముద్రం' 
  • ఇలాంటి సినిమా ఎందుకు తీశావన్నా? అని ప్రశ్నించిన నెటిజన్
  • త్వరలోనే మంచి కథతో వస్తానని సమాధానమిచ్చిన అజయ్
టాలీవుడ్ దర్శకుడు అజయ్ భూపతి తన తొలి చిత్రం 'ఆర్ఎక్స్ 100'తో ఘన విజయం అందుకున్నాడు. ఈ సినిమా విజయంతో ఆయనకు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా 'మహా సముద్రం' చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. శర్వానంద్, సిద్ధార్థ్, ఆదితీరావు హైదరీ, అనూ ఇమాన్యుయేల్ నటించారు. జగపతి బాబు, రావు రమేశ్ లు కీలక పాత్రలను పోషించారు. ఇంతమంది స్టార్లు సినిమాలో ఉన్నప్పటికీ... ఈ చిత్రం ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అజయ్ భూపతిని ట్యాగ్ చేస్తూ... 'మహా సముద్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాం. ఎందుకు అలా తీశావ్ అన్నా?' అని ప్రశ్నించాడు. దీనిపై అజయ్ స్పందిస్తూ క్షమాపణ చెప్పారు. మీ అంచనాలను అందుకోలేకపోయానని... త్వరలోనే అందరినీ సంతృప్తిపరిచే మంచి కథతో ముందుకు వస్తానని సమాధానమిచ్చారు.


More Telugu News