మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన షర్మిల
- నిరుద్యోగ సమస్యపై ప్రతి మంగళవారం షర్మిల దీక్ష
- మంగళవారం మరదలు అంటూ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు
- ఇలాంటి కుక్కలను తరిమికొట్టే రోజు వస్తుందన్న షర్మిల
'మంగళవారం మరదలు' అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. నిరుద్యోగ సమస్యపై షర్మిల ప్రతి మంగళవారం నిరసన దీక్ష చేపడుతున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా కామెంట్ చేశారు.
మంత్రి వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. చందమామను చూసి శునకాలు మొరగడం సాధారణమైన విషయమేనని అన్నారు. టీఆర్ఎస్ మంత్రులు శునకాల్లా మొరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి కుక్కలను తరిమికొట్టడం ఖాయమని, ఆ రోజు మరెంతో దూరంలో లేదని పేర్కొన్నారు.
కాగా, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి సత్యవతి కూడా మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంజన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, ఇదే ధోరణి కొనసాగిస్తే చీపుర్లు తిరగేసి కొడతామని హెచ్చరించారు.