తెలంగాణ రోజువారీ కరోనా కేసుల బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 38,373 కరోనా పరీక్షలు
- 171 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 58 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒక మరణం
- ఇంకా 4,126 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,373 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 171 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 58 కొత్త కేసులు నమోదు కాగా; కరీంనగర్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి జిల్లాలలో 13 కేసుల చొప్పున గుర్తించారు. వికారాబాద్, నారాయణపేట, ములుగు, మెదక్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 208 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,922 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,126 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,952కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.58 శాతానికి పడిపోయింది. జాతీయస్థాయిలో అది 1.3 శాతంగా ఉంది.