ఏపీలో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు... రెండు రాష్ట్రాలను కలిపేసి పోటీ చేయండి: కేసీఆర్ కు పేర్ని నాని సలహా

  • ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని కోరుతున్నారన్న కేసీఆర్
  • మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని నాని వెల్లడి
  • రెండు రాష్ట్రాలను కలిపేసేలా తీర్మానం చేయాలని సూచన
  • సీఎం జగన్ కూడా అదే కోరుకుంటున్నారని వెల్లడి
ఏపీలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయాలని తమను కోరుతున్నారంటూ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లీనరీలో వెల్లడించడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ పార్టీ పెడతామంటే తమకేమీ అభ్యంతరంలేదని అన్నారు. అయితే, "రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు.... రెండు రాష్ట్రాలను కలిపేసి కేసీఆర్ పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది" అని వ్యాఖ్యానించారు.

"దీనిపై తెలంగాణ మంత్రివర్గంతో కేసీఆర్ చర్చించాలి. రెండు రాష్ట్రాలను కలిపేందుకు ఓ తీర్మానం చేయాలి. ఈ అంశంలో సీఎం కేసీఆర్ ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ఒకే రాష్ట్రంగా ఉండొచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నది మా సీఎం అభిమతం కూడా. సమైక్య రాష్ట్రం అనేది తెలుగు వాళ్లకు అవసరం అని సీఎం జగన్ 2013లోనే చెప్పారు. ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టవద్దు అని ఆనాడే ఎలుగెత్తారు"  అని వివరించారు.


More Telugu News