షారుఖ్ కుమారుడికి బెయిల్ రావడంపై రామ్ గోపాల్ వర్మ స్పందన!

  • ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్ట్
  • ఆర్యన్ తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి
  • అంత ఖరీదైన లాయర్లను చాలా మంది పెట్టుకోలేరన్న ఆర్జీవీ
బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ కేసులో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. దాదాపు మూడు వారాలకు పైగా జైల్లో గడిపిన తర్వాత ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరయింది. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ముకుల్ రోహత్గి వంటి అత్యంత ఖరీదైన లాయర్లను చాలామంది పెట్టుకోలేరని... అందుకే అమాయకులైన ఎంతో మంది జైళ్లలోనే అండర్ ట్రయల్స్ గా మగ్గిపోతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News