టీడీపీ నేత పట్టాభి పోలీసు కస్టడీ పిటిషన్ కొట్టివేత
- ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల కేసు
- తమ కస్టడీకి పట్టాభిని ఇవ్వాలని పోలీసుల పిటిషన్
- డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొన్న విజయవాడ కోర్టు
ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన కొన్ని రోజులు జైలులో ఉండి, బెయిల్‌పై విడుదలయ్యారు.
అయితే, ఆయనను తమ కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా దాన్ని ఈ రోజు కోర్టు కొట్టివేసింది. పోలీసుల పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు విజయవాడ కోర్టు పేర్కొంది. ఇటీవల జగన్‌పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా, చోటు చేసుకున్న తదనంతర పరిణామాల వల్ల ఏపీ వ్యాప్తంగా కలకలం చెలరేగిన విషయం తెలిసిందే.